Reviews

Aravinda Sametha Genuine Review by Non NTR & Trivikram Fan

Aravinda Sametha Genuine Review

Yes, we have seen many positive reviews about NTR‘s Aravinda Sametha movie in many websites and also people who started praising the brilliant work of trivikram in our facebook timeline saying its Aravinda Sametha Genuine Review. But everyone mentioning a word “See with less Expectations” that means something is lacking in the film. There are few films like Baahubali, Geetha Govindam, arjun reddy etcc which still we enjoy to the core even if we go with a sky level expectation.

But why should we see Aravinda Sametha with less Expectations? whats wrong in that? people are not dare enough to highlight the minus points in the film just because they are scared of the fans who uses abusive comments if they do so. But there are few people who doesnt care about what people think, they write what they feel. I found 2 of them in my facebook timeline and posting their most genuine reviews here.

Spoilers ahead – Read if you already watched the film

Aravinda Sametha Genuine Review By Vamsy Krishna

టార్చ్ బేరర్ కాదు . యమా టార్చర్

“ప్రతి ముప్పై ఏళ్ళకి మనిషి మారతాడు . సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు . రాజకీయనాయకులు దాన్ని తరం అంటారు . మామూలు జనం జనరేషన్ అంటారు . ప్రతి తరం లోనూ టార్చ్ బేరర్ లాంటి ఒకడు ఉంటాడు . అదుగో ఆ వెళుతున్నాడే వాడు టార్చ్ బేరర్ “అని రావు రమేష్ పాత్ర కోసం ఒక మంచి డైలాగు రాసాడు త్రివిక్రమ శ్రీనివాస్ అరవింద సమేత వీర రాఘవ లో . బహుశా ఆ డైలాగ్ రాస్తున్నప్పుడు తాను ఒక టార్చ్ బేరర్ లాంటి సినిమా తీస్తున్నాడు అని భావించాడేమో తెలియదు కానీ జరుగుతున్న సినిమాను చూస్తూ రావు రమేష్ నోటి వెంట వెలువడిన ఆ డైలాగు విని ప్రేక్షకుడు నవ్వుకుంటే అతడి తప్పేమీ లేదు . త్రివిక్రం శ్రీనివాస్ లాంటి వాళ్లే అతడి ప్రేక్షకులు కూడా ! శ్రీనివాస్ కి రాత్రి పూట అద్భుతంగా తోచిన ఒక ఆలోచన ఉదయం లేచి తల్చుకుంటే నవ్వొస్తుందట . తనే చెప్పుకున్నాడు . బహుశా ఆ డైలాగు కూడా రాత్రిపూట రాసి ఉదయం తల్చుకుని ఉండడు

మహాభారతం ,యుద్ధ పర్వం , శాంతి ,స్త్రీ పర్వాల గురించి చాలా చెప్పిన శ్రీనివాస్ ఇంటర్వ్యూ లు చదివి సినిమా కు వెళితే అక్కడ హింసా స్వరం తప్పిస్తే మరేమీ కనిపించదు . కళింగ యుద్ధం తరువాత సామ్రాట్ అశోక బౌద్ధ మతం స్వీకరించి శాంతి ప్రబోధం చేశాడట . కళింగ యుద్దానికి తక్కువ కాని యుద్ధ సన్నివేశం తో సినిమా ఓపెన్ చేసి మొదటి ఇరవై నిమిషాలు మెస్మరైజ్ చేసిన శ్రీనివాస్ ఆ తరువాత గాడి తప్పి రొటీన్ ఫ్యాక్షన్ యుద్దానికి తెర తీసి చాలా నిరుత్సాహ పరచాడు .

కథ చెప్పుకోవాలంటే రెండే రెండు పంక్తులు . ఐదు రూపాయల కోసం మొదలైన ఒక గొడవ భారీ ఫ్యాక్షన్ గా మారి నల్ల గుట్ట , కొనమద్ది గ్రామాలనడుమ మూడు దశాబ్దాలపాటు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది . లండన్ లో చదువుకుని తిరిగి వస్తున్న కొడుకు కి స్వాగతం చెప్పడానికి వెళ్లి కొడుకుని తీసుకుని వస్తున్న కొనమద్ది నారపరెడ్డి మీద నల్లగుట్ట బసిరెడ్డి మనుషులు దాడి చేసి చంపేస్తారు . నరపరెడ్డి కొడుకు వీర రాఘవరెడ్డి తన లక్షణం గా తానూ కత్తి దూసి శత్రువులను తుద ముట్టిస్తాడు . నాయనమ్మ మాటలతో లోలోపల ఎదో ఆలోచన మొదలై రెండు గ్రామాల మధ్యా శాంతి నెలకొల్పాలని ఆర్నెల్లు విశ్రాంతి ప్రకటించి హైదరాబాద్ వెళ్ళిపోతాడు . ఆ తరువాత రెండు గ్రామాల మధ్య శాంతిని ఎలా నెలకొల్పాడు అన్నది అసలు కథ . సమర సింహా రెడ్డి దగ్గరనుండి ఇంద్రసేనా రెడ్డి మీదుగా వీర రాఘవ రెడ్డి దాకా ఒకటే కథ

ఈ కథ కి శ్రీనివాస్ చాలా తెలివిగా యుద్ధం తరువాత గాయపడిన స్త్రీల కోణం నుంచి సినిమా తీశాను అని చాలా చెప్పుకున్నాడు కానీ అదేమీ లేదు . సినిమా అంతా పురుష దృక్కోణం లోనే నడుస్తుంది . ఆంత్రోపాలజీ చదువుకునే అరవింద పట్ల అతడు ఆకర్షితుడై తన సమస్యలకు ఆమె పరిష్కారం అని వాచ్యంగా చెపుతాడు కానీ ఆ ప్రత్యేకతలు ఏవీ ఆమెలో ఉన్నట్టు ప్రేక్షకుడి అనుభవం లోకి రాదు . అందరు అడా పిల్లల లాగే ఆ అమ్మాయి కూడా తను తిప్పించుకునీ తిప్పించుకునీ ఓ .కే చెపితే పురుషుడు తన భుజం మీద తలా వాల్చి మిగతా ప్రపంచం మొత్తానికి షట్ డౌన్ చేసెయ్యాలి అనుకునే టైపు . ఆమె అతడి లోలోపలి అశాంతిని ఎలా తొలగించగలదు అని అతడుఅనుకున్నాడో శ్రీనివాస్ కే తెలియాలి . నేను నా యుద్దాన్ని గెలిచి వచ్చాకే నీ భుజం మీద తల వాలుస్తాను అని అతడు చెప్పి వెళ్ళిపోయాక కూడా నీలాంబరి దగ్గరకొచ్చి నా కంటే యుద్ధం ఎక్కువా అని ఆమె అడుగుతుంది ?

స్త్రీల దగ్గర మనం ఏదీ చర్చించం అని శ్రీనివాస్ బయట ఇంటర్వ్యూలలో చెప్పాడు కానీ తన హీరో కూడా స్త్రీల దగ్గర ఏదీ చర్చించడు . అరవింద సమేత వీర రాఘవ అని పేరు పెట్టాము కనుక ఆ పేరుకి జస్టిఫికేషన్ ఇవ్వాలని తను కుడి వైపు కి అనకపోతే నాకు బసిరెడ్డి మనుషులు టౌన్ కి వచ్చారు అనే విషయం తెలిసేది కాదు కదా, ఆమె తమ్ముడి కి కథ చెప్పక పోతే బసిరెడ్డి సంగతి తెలిసేది కాదు కదా

లాంటి లాజిక్ , రీజనింగ్ ఏదీ లేని డైలాగులు రాసి సమర్ధించుకోవాలని చూశాడు . యుద్ధం ఏక పక్షం గా ఆపితే శాంతి నెలకొలదు , శాంతి కావాలి అంటే ఎదుటి పక్షాన్ని కన్విన్స్ చేయాలి అని హైదరాబాద్ లో చదువుకునే అరవింద చెప్పిందాకా లండన్ రిటర్న్డ్ వీర రాఘవ కి తెలియదట .బాలిరెడ్డి తో సమావేశం ఏర్పాటు చేయమని రావు రమేష్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నప్పుడే అరవింద కిడ్నాప్ అయిందని వీర రాఘవ కి ఫోన్ వస్తుంది . అతడు వెంటనే నేను వస్తున్నాను అని బయలు దేరబోతుంటే రావు రమేష్ “వెళ్ళు ! వెళ్లి ఒకళ్ళనొకళ్ళు చంపుకోండి . చంపడం మీ డి యెన్ ఏ లోనే ఉంది ” అంటే అహం దెబ్బతిని ఆగి పోయాడు కానీ తన దృక్పథం వలన కాదు . నువ్వు ఎక్కడ వున్నా వెతికి వెతికి మరీ చంపుతా , బెంగళూరు లో చదువుకుంటున్న నీ కొడుకును చంపుతా అని బెదిరించి మరీ అరవిందను ఆమె తమ్ముడిని విడిపించుకుంటాడు వీర రాఘవ . కరడు కట్టిన ఒక ఫ్యాక్షనిస్ట్ అలా బెదిరింపులకి లొంగుతాడు , అదీ హీరో చేసాడు కనుక నమ్ముతాడు అని శ్రీనివాస్ చెపితే మనం కూడా నమ్మాలి

ప్రతి సినిమా కు ఒక ఆయువు పట్టు లాంటి సన్నివేశం , ఆత్మ లాంటి దృక్పధం ఒకటి ఉంటుంది . అది ఈ సినిమా కు రామ జోగయ్య శాస్త్రి రాసిన పెనిమిటి పాట . నిజానికి ఆ పాటలోని భావానికి తగిన కథ రాసుకుంటే శ్రీనివాస్ తీయాలి అనుకున్న సినిమా తయారు అయ్యేదేమో . ఆ పాటకు ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయమూ చేసాడు శ్రీనివాస్ . మా అమ్మ పాడిన జోల పాట అనుకున్నా అని చెప్పిన వీర రాఘవ మీద కాక ఆ పాటని వాళ్ళ అమ్మ మీదే చిత్రీకరించి ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ తో చూపిస్తే మరింత హార్ట్ టచింగ్ గా ఉండేది . స్త్రీల కోణం నుండి సినిమా అని చెప్పిన శ్రీనివాస్ తన కంటే ముందు కృష్ణ వంశీ తీసిన అంతఃపురం చూశాడో లేదో తెలియదు కానీ ఆ సినిమా లో ప్రకాష్ రాజ్ , సౌదర్య ల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ను అర్ధం చేసుకుని ఉంటే ఈ సినిమా లో తన సొంత కొడుకుని చంపుకున్న బసిరెడ్డి ని అతడి భార్య నిలదీశే సన్నివేశం మరింత పండి ఉండేది . ఇద్దరు దర్శకుల మధ్య పోలిక కాదు కానీ ఒకే రకమైన థీమ్ ను సినిమా చేస్తున్నప్పుడు తన ముందు తరం ఏమి చెప్పింది తెలుసుకుంటే తన సృజనే మరింత మెరుగు పడి మరిన్ని కొత్త కోణాలను ఆవిష్కరించేది అని ఒక చిన్న ఆశ

ఈ సినిమా లో మెచ్చుకునే అంశాలు ఏవీ లేవా అంటే ఎందుకు లేవు చాలా వున్నాయి . బసిరెడ్డి , వీర రాఘవరెడ్డి ముఖాముఖీ ఎదురైన ఆఖరి సన్నివేశం లో శ్రీనివాస్ అద్భుతమైన డైలాగులు రాసాడు . ఒక మంచి పాత్ర లభిస్తే తారక్ ఎంతలా రెచ్చిపోగలడో , నాకు అసలు నటన రాదు అని ఓపెన్ హార్ట్ లో చెప్పుకున్న జగపతి బాబు ఎంత గొప్పగా నటించగలడో ఈ సినిమా మరొక సారి కొత్తగా చెపుతుంది . ముఖ్యంగా గొంతు లో ఓకనరం తెగి ఆ ఖాళీ స్థలం లోకి గాలి వెళ్ళినప్పుడు మాట్లడేటప్పుడు ఎలా ఎగశ్వాస వస్తుందో దాన్ని సెట్టిల్డ్ మానేజ్ చేస్తూనే ఎక్కడా ముఖం లో భావం చెడకుండా , కళ్ళలో క్రౌర్యం కదలకుండా జగపతి బాబు ఎంత గొప్పగా చెప్పాడో చూడాల్సిందే తప్పిస్తే రాయలేము .

ఒక గొప్ప సినిమాగా , గొప్ప సినిమా గా మిగలవలసిన సినిమాను త్రివిక్రమ్ కేవలం హిట్ దగ్గరే ఆపేశాడు . అదీ విషాదం

Another Review by Hari Krishna

వినే టైం., చెప్పే మనిషి వల్ల ..,విషయం విలువే మారుతుంది” 🙏🙏🙏

వినే టైం (festival season) 👌 చెప్పే మనిషి ( Jr.NTR ) 👌👌 విషయం ( Factionism )👌👌👌

Kaani evadiki chepthunam ela chepthunam anna vishayam pakkana pettinav, Pandaga puta selavu lekunda studyhour pettinatlundi. intikochi Simhadri chustunte Rajamouli nekanna baa comedy rasthadu ani first time anipistundi. Boyapati cinemala partlu partlu ga bagundi.Mothaniki idhi Trvikram cinema aithe kaadu!!

Collections vastai emo gani Audience Moham lo navvu matiki raadu. Another NTR film falls short of expectations. Simhadri still remains as his best work and the wait continues till 2020 #RRR

Disclaimer : Pk ki panganamam pettinodivi NTR oka lekka neku, Sunil ni parichayam chesina writer la kakunda Sunil ni vadukoleni Director la migilipothav. Thuu 🤬🤬🤬 ika social media lo ne bhajana chestunna vallaki oka pedha 🙏

Post Your Comments Here