Information

Is Dream11 is Genuine ? Here are some winning payment proofs

Dream11 is Genuine?

We all have a doubt while playing the fantasy point system betting, that is “Is Dream11 is Genuine?” Yes, even i had this doubt, because i haven’t seen a person winning 20 lakhs or 25 Lakhs from the game in my friends list, so i decided that Dream11 will give that #1 winning amount to its own team members. But here the logic behind my mistaken thought, Dream11 will share all the participating teams details as a PDF file and that can be downloaded when the match starts, later after the match completed, we can compare the winner team with the data we have already downloaded in your mobile.

Finally i have found on of my facebook trusted friend  Srinu Pandranki  who has won 34K amount after the tax deduction and then i started searching in the google with the term Dream11 Winning Proof and found many success stories of dream11, below is the success story of Srinu Pandranki copied from his timeline which also has a useful tips for you, i have posted both English and telugu formats. Please read carefully.

Telugu Version : Dream11 is Genuine ?

Dream 11 ఎన్నాళ్లు నుంచో ఉన్నా నేను ఆడడం మొదలు పెట్టినది కిందటి సంవత్సరం IPL నుంచి. మొదట్లో కొన్ని సందేహాలు ఉండేవి కానీ అన్నీ నివృత్తి చేసుకుని ఆడడం మొదలు పెట్టాను.

ఇది బెట్టింగ్ కాదా!? లీగల్ ఎలా అయ్యింది?
భారతీయ చట్టం ప్రకారం తమ ప్రమేయం లేకుండా వచ్చే రిజల్ట్ మీద పందెం కాయడాన్ని జూదం అంటారు. అంటే గుర్రపు స్వారీ లో గుర్రం ఓటమి గెలుపును మీరు నిర్ణయించలేరు. అలాగే పేకాటలో కొన్ని ఆటలు కేవలం అదృష్టం మీద నిర్ణయింపబడే ఆటలు ఉంటాయి. అవన్నీ చట్ట విరుద్ధమే. అయితే అదే పేకాటలో ‘రమ్మీ’ లాంటి ఆటలు మన ఆటతీరు బట్టి ఫలితముంటుంది. అందుకే అది లీగల్ అయ్యింది. ఇప్పుడు అర్ధమైంది అనుకుంటా డ్రీమ్ 11 జూదం కిందకి ఎందుకు రాదో!! ఆడేది ఆటగాళ్లే అయినా ఎవరు ఆడేది, ఎవరు ఆడనిది, పిచ్ స్వభావం బట్టి, ఆటగాడి ముందు ప్రదర్శించిన ఆటను బట్టి ఇలా రకరకాల అంచనాలతో టీంని తయారు చేయాలి. అదృష్టం కొద్దిగా కలిసి రావాలన్నది నిజమే అయినా కేవలం అదృష్టమే మీదే ఆధారపడి గెలవడం దాదాపు అసాధ్యం.

నేను డ్రీమ్ 11 కేవలం IPL సీజన్ మాత్రమే ఆడతా. ఎలాగూ మాచ్ చూస్తాం కాబట్టి, చూసే మాచ్ మనకి మరింత ఎక్సైట్ అవడానికి ఉపయోగ పడుతుంది కనుక, లీగల్ కూడా కనుక ఆడతా. పైగా మనం పెట్టాల్సింది చాలా చిన్న మొత్తం. ₹50 తో కూడా ఆడవచ్చు. లక్షల్లో గెలవొచ్చు. నమ్మశక్యంగా లేకున్నా నిజం. ఇది ఒక విధంగా లాటరీ పద్ధతే. అంటే లాటరీ అసలు ఎలా పని చేస్తాయి!? 10000 మంది పది రూపాయలు పెట్టి టికెట్ కొంటె లక్ష రూపాయలు వస్తుంది. లాటరీ పెట్టిన వాడు ‘లక్ష రూపాయలు’ అనౌన్స్ చేసి 12000 టికెట్స్ అమ్మితే, అతడికి 20 వేలు లాభం వస్తుంది. వీళ్ళందరిలో ఒకడు గెలుస్తాడు. నేను లాటరీ టికెట్, డ్రీమ్ 11 వంటి వాటిని ఎందుకు ప్రోత్సహిస్తాను అంటే నేను గెలిచే అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంటూనే ఒకడిని గెలిపించడానికి నా వంతు సహాయం చేస్తున్నాను.

Dream 11 కు వస్తే క్రితం ఏడాది నాకు పెద్దగా వచ్చింది కానీ పోయింది కానీ లేదు. ఈ సంవత్సరం కొంచం ఉదృతంగా ప్రయత్నిద్దామని 6 టీమ్స్ పెట్టుకోవచ్చనే అవకాశాన్ని వినియోగించుకుని రోజు 6 టీమ్స్ ని మెగా కాంటెస్టులు రెండింటిలో పెడుతున్నాను. అంటే గత 17 రోజులుగా ₹500-600 మధ్యలో పెడుతూ వస్తున్నాను. ఒకోసారి పోవడం ఒకసారి రావడం లాంటివి జరగగా మొత్తంగా నిన్నటికి నావి ₹3000 రూపాయలు పోయాయి.

అయితే నిన్న చిన్న విచిత్రం జరిగింది. నేను ఎంచుకున్న టీం రెండో ఇన్నింగ్స్ 18 వ ఓవర్ ముగిసేసరికి #1 లో ఉంది. అంటే ఇంకో రెండు ఓవర్లు అదే స్థానం లో ఉంటే నాకు లక్షల్లో డబ్బు వచ్చేది. కానీ చివరి రెండు ఓవర్లో రస్సెల్ మాచ్ ని తలకిందులు చేయడం ఆ ప్లేయర్ నా టీం లో లేకపోవడం వలన మూడు కాంటెస్ట్ లో # 1 ఉన్న వాడిని కాస్తా #3 #10 మరియు #29 స్థానాలకు పోయాను. దాంతో టాక్స్ పోను ₹34,000 అకౌంట్ లో వేశాడు. ముందు రాబోతుందని ఆశ పడ్డ లక్షలతో పోల్చుకుంటే తక్కువే అనిపించినా ఇది కూడా చిన్న మొత్తం కాదు. ఒక విధంగా చాలా సంతోషంగా ఉంది కూడా. 22లక్షలు మంది పాల్గొన్న గేమ్ లో కొద్ది సేపు #1 గా నిలవడం చివరికి #3 #10 #29 స్థానాల్లో నిలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇందాక చెప్పినట్టు ఇందులో కచ్చితంగా అదృష్టం అనేది భూమిక పోషిస్తుంది కానీ మన ఆటతీరు కూడా చాలా ముఖ్యం. నేను ప్రతీ రోజూ ప్రతీ గేమ్ ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎనాలిసిస్ చేసుకుంటూ ముందుకి పోతున్నాను. దీనికి పెద్ద సమయం కూడా కేటాయించక్కర్లేదు. టీం ని పెట్టడానికి ఓ అరగంట, మ్యాచ్ అయిపోయాక ఒక అరగంట కేటాయిస్తే చాలు. అలాగే, ఇందులో ఉండే సౌలభ్యం ఏంటంటే మనం మ్యాచ్ కచ్చితంగా చూడాల్సిన అవసరం లేదు. మన టీం మనం పెట్టేసుకుని మన పనులు మనం చేసుకున్నా సరిపోతుంది

Dream 11 టీం సెలెక్ట్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన 11 కనీస జాగ్రత్తలు: (కొత్తవారికి)

1. ఆరోజు ఏ ఆటగాడు బాగా ఆడతాడని నమ్మకం ఉందో అతడిని కెప్టెన్ గా, తర్వాత బెస్ట్ ని వైస్ కెప్టెన్ గా పెట్టుకోండి. ఇది చాలా కీలకమైన నిర్ణయం. మీరు ఎంత మంచి టీంను సెలెక్ట్ చేసుకున్నా ఇందులో తప్పు జరిగితే మాత్రం ఉపయోగం ఉండదు

2. తెలివిగా సెలెక్ట్ చేయడం ముఖ్యం. ఉదాహరణకు మీ కెప్టెన్ వైస్ కెప్టెన్ ఒకే టీం కి చెందిన వారైతే వాళ్ళు ఓపెనర్స్ అయితే, అవతల టీం ఓపెనింగ్ బౌలర్లుని టీం లో పెట్టుకోవడం వృధా కదా? అంటే మీ అంచనా ప్రకారం వాళ్ళు బాగా ఆడితే వాళ్ళు చితక్కొట్టేది ఆ బౌలర్లునేగా? ఇంక మీ టీంలో ఆ బౌలర్లుకు చోటేది!?

3. మన ఇష్టాలు వేరు. ఆట వేరు. మీకు కోహ్లీ ఇష్టం కదా అని ప్రతీ మాచ్ తనని పెట్టుకోవడం లో ఉపయోగం ఉండదు. టీంకు ఆరోజు పనికి రారనిపిస్తే నిర్ధాక్షణ్యంగా తీసి పారేయడమే

4. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. వాడెప్పుడు ఆడాడులే అనుకుని వదిలేసిన వాడే ఆరోజు హీరో అవ్వొచ్చు. అప్పుడు రాంక్ మీ ఎంసెట్ రాంక్ కన్నా పెద్దదై పోతుంది.

5. ఒక్క టీం తో ఆడడం కన్నా ఎక్కువ టీంలతో ఆడడం పనికొస్తుంది. ఒకటి కాకపోయినా వేరొకటి పనిచేయొచ్చు. అలాగే టీం సెలెక్షన్ టైం లో ఎవరనినైనా వదిలేసారు అని మనసు లాగితే వాళ్లని పెట్టి ఇంకో టీం తయారు చేసుకోవచ్చు.

6. సేఫ్ గేమ్ ఆడొద్దు. మనం పెట్టె ₹50 ₹100 వెనక్కి వస్తే ఏం లాభం. కొడితే పెద్దది కొట్టాలనేగా అందరి ఆరాటం. అందుకే రిస్క్ తీసుకోండి. కొంచం చెత్త టీం లా అనిపించినా ముందడుగు వేయండి. పోతే పోని అన్నట్టే ఆడండి. అప్పుడే పోయినా బాధ అనిపించదు కూడా!

7. టీం సెలెక్ట్ చేసేటప్పుడు వేరియేషన్స్ ఉండేలా చూసుకోండి. అలాగే మీదైన పద్ధతుల్లో మీరు ఎనాలిసిస్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ తప్పు ఒప్పులు ఉండవు. ఇదే సరైన పద్ధతి అంటూ ఉండదు. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఆడుకోవడమే.

8. మనం నమ్మిన ప్లేయర్ ఆరోజు ఆడకపోవచ్చు. నిరాశపడొద్దు. తనదైన రోజున తను ఆడుతాడు కనుక తరుచూ అవకాశం ఇస్తూ ఉండండి. అయితే పైన చెప్పినట్టు మీకు ఇష్టమని పెట్టకూడదు. ఆరోజు పనికొస్తాడాని నమ్మితేనే పెట్టాలి.

9. మాచ్ రిజల్ట్ కి మనం సెలెక్ట్ చేసే టీంకి సంబంధం ఉండదు. గెలుస్తాది అనుకున్న టీం లో వారినిఎక్కువ మందిని పెట్టి, ఓడుతుంది అనుకునే టీంలో వారిని తక్కువ మందిని పెడితే అది మంచి టీం అవుతుందని అనుకోవడానికి లేదు. అలాగే గెలిచే టీం లో వాళ్లే కెప్టెన్ వైస్ కెప్టెన్ అవ్వాలని కూడా లేదు. మీ దృష్ఠి కేవలం బాగా ఆడే ఆటగాళ్ల మీద మాత్రమె ఉండాలి.

10. టాస్ కన్నా ముందే టీమ్స్ ని తయారు చేసి పెట్టుకోవడం ఉత్తమం. టాస్ తర్వాత ఎవరు బాటింగ్ అన్న దాన్ని బట్టి పిచ్ రిపోర్ట్ బట్టి అప్పటికప్పుడు ఒక అంచనా వేసుకుని ఎడిట్ చేయొచ్చు. కానీ మొత్తం టీంను అప్పుడే పెట్టాలంటే టైం సరిపోక తప్పులు చేయొచ్చు.

11. Hope. అన్నిటి కన్నా ముఖ్యమైంది. ఎన్ని సార్లు ఓడినా గెలుస్తామన్న నమ్మకం మాత్రం ఎప్పటికి ఉండాలి. అది ఉంటే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా గెలవొచ్చు.

ఈ పోస్ట్ చదివాక మీకు ఆడాలనిపిస్తే, మీరు మాత్రం దిగేముందు ఆలోచించి అన్నిటికి సిద్ధపడి దిగండి. అత్యాశకు పోయి పెద్ద మొత్తాలలో ఆడకండి. చిన్న మొత్తం అవసరం పడే మెగా కాంటెస్ట్ లు మాత్రమె ఆడండి. All the best 😊💐

English Version : Dream11 is Genuine ?

I have started playing with the Dream11 since aa year even though its been there since a while. There were some doubts in the beginning, but I started to play by ignoring everything.

Isn’t this betting!? How is legal?

As per Indian law, it is called as gambling to bet on the result that comes without their involvement. That means you can’t decide to win the horse’s defeat in the horse riding. Also, some games in the paper are only the games that are decided on luck. It’s all about the law. But the games like ‘Rummy’ in the same paper will result in our game. That’s why it’s legal. I think you understood now about why didn’t the dream come out of 11 gambling!!

We have to decide the team depends on players previous record, pitch nature and the performance of the player in previous match and It is true that luck is a little together, but it is almost impossible to win based on the luck.

I play dream 11 only during IPL season ,anyhow i see the match, so putting a bet on dream11 wil make the match more excited. Over we have to put a lot of small. Can also play with ₹ 50 Can win in lakhs. Truth without being trusted. This is a way of lottery. How does the lottery actually work!? 10000 people will get lakh rupees if they buy a ticket for 10000 rupees. If the one who has given the lottery will sell ‘lakh rupees’ and sell 12000 tickets, he will get 20 thousand profit.

Coming to the money, i didnt lost much during the last year,I am keeping 6 teams in both the mega candidates for the opportunity to try a little better this year. That means I’m coming in between ₹ 500-600 in the past 17 days. I have lost  rs. 3000 for yesterday.

But yesterday was a little strange. The Team I selected is on #1 place till the 18th over,  If another two overs are in the same place, I will have money in lakhs. But in the last two over, Russell has changed the story by scoring 48 out of 13 balls where i haven’t selected him in my team.. just because of that from the rank #1 i have gone to #3 #10 and #29  which in result i got ₹ 34,000 account after deducting the tax. It is not a small thing of earning 34K by investing 500 rupees in a game where 22 lakhs of people participated

11 minimum precautions to be taken when the dream 11 team is selected: (for new ones)

1. Select the player as captain only if you think that he will play well in today’s match, just dont blindly select him since he is famous. This is a very important decision. What a good team you have selected, it will not be useful if there is a mistake in this.

2. is important to select wisely. For example, if your captain vice captain is the one who belongs to the same team, if they are a opener, is it waste to keep the opponent team opening bowlers in the team? If they play well according to your estimation, they will be irritated by those bowlers? Now in your team, the bowlers are in the place!?

3. Our likes are different. The game is different. If you like kohli, every match will not have the use of keeping him. just kick him off if you believe that he doesnt play well for today

4. Don’t underestimate anyone. The one who left as a loser can also become a hero. Then Rank will go bigger than your eamcet.

5. playnig with more teams is better compared to playing with single team, this increases the winning chances. In the team selection time, if you feel like you left someone, you can make them as another team.

6. Don’t play safe game of a profit of  getting your  invested money ₹ 50 ₹ 100 back. Everyone’s worship is to hit the big one. That’s why take risk. go ahead even if you feel like its a dirty team

7. Make sure to have variations when the team is selected. And you try to make analysis in your own ways. There won’t be any wrong contracts here.

8. The player we selected may not be playing on that day. Don’t be disappointed. Keep giving a chance so that you can play it on her own day. But you should not like what you say above. We have to believe that the day will work. (Also Dream11 has changed the rules of modifying the team even after the toss. For example for 8 PM Match, toss will be at 7:30 so you can check the playing 11 team and modify your dream11 team. You will be having 30 mins of time to do that)

9. Dont concentrate on the Winning team like SRH or RCB, Just concentrate on the winning players

10.It is better to make teams before Toss. After the toss, based on the pitch report, it can be edited by an estimation. But if you want to put the whole team during the last moment , you can make the time to make mistakes.

11. Hope. It’s more important than all. No matter how many times you win, the trust that you will win will never be there. If it is not this year, you can win even next year.

*****

If you want to play after reading this post, think about it before you come and get ready for everything. Play the mega contest that needs a small amount. dont play with huge amount. All the best 😊💐

Post Your Comments Here