Check out the latest News about Shekar Kammula's Life Is Beautiful Which is getting released world wide on September 13th with all new Actrors, i am sharing the views and message given By Shekar Kammula i nhis official Facebook page.
ప్రముఖ దర్శకడు శేఖర్ కమ్ముల తాజా సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సెప్టెంబర్ 14 విడుదలకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ఈ చిత్రం అద్భుతాలు సృష్టిస్తోంది. తెలుగు సినిమా చరిత్రలోనే అమెరికాలో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం యూఎస్ రైట్స్ దక్కించుకున్న FICUS సంస్థ ఏకంగా 55 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.
ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ రేంజిలో అమెరికాలో విడుదల కాలేదు. శేఖర్ కమ్ముల చిత్రాలకు అమెరికాలో ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చి ఆనంద్, హ్యాపీడేస్ చిత్రాలు అమెరికా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. కొత్తవారితో రూపొందించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఇప్పటికే అన్ని ఏరియాల్లో కలిపి 18 కోట్ల బిజినెస్ చేయడం గమనార్హం.
శేఖర్ కమ్ముల సినిమా గురించి చెప్తున్నా విషయాలు సినిమా 65 వీక్షకుల కోసం
‘ఆనంద్'కు ‘మంచి కాఫీలాంటి సినిమా' అనే ఉపశీర్షిక పెట్టాను. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'కి అలాంటి ట్యాగ్‌లైన్లు లేవు కానీ... ‘ఇది మన సినిమా' అని మాత్రం చెప్పుతున్నాను. మనసున్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ‘‘పరీక్షలు రాశాం. ఫలితం ఎలా ఉంటుందో మాకు తెలుసు. తప్పకుండా విజయం సాధించి తీరుతాం''
"స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ఓవర్‌సీస్‌లో కూడా భారీ స్థాయిలో విడుదల ఉంటుంది. నైజాం ప్రాంతానికి ‘దిల్'రాజు విడుదల చేస్తున్నారు. సీడెడ్, కర్నాటక ‘ఈగ' నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేయనున్నారు. తెలుగు సినిమాల్లోనే రికార్డు స్థాయిలో అమెరికాలో 55 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేస్తున్నాం. ఇక విజయలక్ష్మీ ఫిలింస్ ద్వారా ఆంధ్రాలో విడుదల కానుంది. వారం ముందు నుంచే విడుదలయ్యే ప్రతి థియేటర్ వద్ద ఆడ్వాన్స్ బుకింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం డీటీఎస్ ఫైనల్ మిక్సింగ్ జరుగుతోంది
‘‘అయిదేళ్ల క్రితం ‘హ్యాపీడేస్' రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు ఆ సినిమా విషయంలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నానో... ఇప్పుడు అంతకంటే కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. సంగీత పరంగా మిక్కీ జె.మేయర్ మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. తోట తరణి కళాదర్శకత్వం, విజయ్ సి.కుమార్ ఛాయాగ్రహణం, మార్తాండ్ కె.వెంకటేష్ కూర్పు ఈ చిత్రానికి ప్రధాన బలాలు
‘‘నేను ఏ సినిమా చేసినా విలువల్ని మాత్రం మర్చిపోను. ఈ సినిమా మిమ్మల్ని షాక్‌కి, థ్రిల్‌కి గురి చేస్తుందని చెప్పను కానీ, కొన్నాళ్ల పాటు మీతో జర్నీ చేస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. కోరికలు, ఆశలు, సంతోషాలు... ఇదే ఈ సినిమా కథ. ఓ కాలనీలోని
ఆరుగురు యువకుల చుట్టూ తిరిగే కథ ఇది. మన బాంధవ్యాలన్నీ ఇందులో కనిపిస్తాయి. ఈ సినిమా ఓ విధంగా నా కల. ఈ కల కార్యరూపం దాల్చడానికే రెండేళ్లు పట్టింది. ఈ సినిమా మేకింగ్‌లో చాలా అవాంతరాలు ఎదురొచ్చినా అధిగమించగలిగాం. వేటూరిగారు లేకపోవడం నాకు గొప్ప విషాదం. ఈ సినిమాలో అమల తొలుత చేయనన్నారు. చాలా బతిమిలాడాను. ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఈ విషయంలో నాగార్జున గారికి కృతజ్ఞతలు చెబుతున్నా
స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ఓవర్‌సీస్‌లో కూడా భారీ స్థాయిలో విడుదల ఉంటుంది. నైజాం ప్రాంతానికి ‘దిల్'రాజు విడుదల చేస్తున్నారు. సీడెడ్, కర్నాటక ‘ఈగ' నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేయనున్నారు. తెలుగు సినిమాల్లోనే రికార్డు స్థాయిలో అమెరికాలో 55 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేస్తున్నాం. ఇక విజయలక్ష్మీ ఫిలింస్ ద్వారా ఆంధ్రాలో విడుదల కానుంది. వారం ముందు నుంచే విడుదలయ్యే ప్రతి థియేటర్ వద్ద ఆడ్వాన్స్ బుకింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం డీటీఎస్ ఫైనల్ మిక్సింగ్ జరుగుతోంది
పసితనం అనుభవాలు, జ్ఞాపకాలు మధురంగా వుంటాయని, ఆ మధుర స్మృతులతోనే ఈ చిత్రాన్ని నిర్మించే ప్రయత్నం చేశానని, చిన్న వయసులో వస్తున్న అనేక అనుమానాలకు పెద్దయ్యాక ఎలా విడిపోయి వాటికి సమాధానాలు దొరుకుతాయనేది చిత్రంలో సరికొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా
0 Comments